Jump to content

పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ కు న శా స్త్ర ము

25



క . మరణము చోర భయంబును,
    ధరణీశుల చేత బాధ § తరుగని రోగం
    బరయఁగ నగ్నిభయంబును,
    సిరివరదా రాహుఫలము § శిఖినరసింహా,76

తా. ఓ లక్ష్మీశా! నరసింహస్వామి! రాహువు పై పల్కి
నను తుమ్మినను మరణము, చోరభయము, రాజబాధ,రోగము
అగ్నిభయము కలుగును.

క . కేతువు ఫలమిదె భూమికి
    నేతీరున దప్పిగ్రామ § మిలనెడబాయున్
    భూతలము దిరిగి వెతఁబడు
    సీతాపతి సాక్షిగాను § శిఖినరసింహా.77

తా . ఓ నరసింహస్వామీ! కేతువు పై బల్కి నను తుమ్మినను ఏవిధ
ముగానైన గ్రామము విడిచి దేశమంతయు తిరిగి కష్టపడును. ఇది
శ్రీరామచంద్రుని సాక్షిగాసుమా!

-: తుమ్ముల శ కు న ము:-

క. రెండుగఁ దుమ్మిన సఫలము,
   ఖండితముగ దుమ్మిచీఁద § గా మరణమగున్ ,
   మొండుగఁదుమ్ముచు నడచిన,
   జెండును దోషములు నరుల § శిఖినరసింహా,78

తా .ఓ నరసింహస్వామి! రెండు తుమ్ములు తుమ్మిన కార్య
జయమును, తుమ్మి చీదిన మరణమును, నడుచుచు తుమ్మిన దోషహ
రణమును కలుగును.