పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

శ కు న శా స్త్ర ము


క. తుమ్ముచుఁ దగ్గుచు నడిచిన,
   నెమ్మది శయనించి యుమియ § నిజమగు బహురో,
   గమ్ములఁ బాయని జడిగా
   జిమ్మును తుమ్ముల ఫలంబు § శిఖినరసింహా,79

తా. ఓ నరసింహస్వామీ! తుమ్ముచు, దగ్గుచు, నడచినను, పరుండ
ఉమ్మివేసినను, అనేక వ్యాధులు సంప్రాప్త మగును,

క. లేచిన మొసలిం జూచిన
    [1] జూచిన బంగారు ఫలము § సుదతుల నటనల్
   జూచిన వీడ్యముఁ జేసిన
   శ్రీచతురా తుమ్ము ఫలము § శిఖినర సింహా.80

తా. ఓ నరసింహస్వామి ! మొసలిని, బాంగారును, పండ్లను, స్త్రీ
నాట్యమును, చూచినను, తాంబూలము వేసికొన్నను, తుమ్మువలని
దోషము హరించును.

క. ఇలఁ గోకినఁగడ కేగినఁ
   దలఁ గోకినఁ జింతసేయ § దడఁబడ జీదన్
   బలుకష్టము తుమ్మిన తఱి
   శిలలైనం గష్టపడును § శిఖినరసింహా.81

తా. ఓ నరసింహస్వామి! తుమ్ముచు భూమి గోకినను, అవతలకుఁ
బోయినను, తలఁగోకికొన్నను, చింతగానున్న, తడబడినను, చీదినను,
రాళ్లకైనను కష్టమువచ్చును.

క. లేచిన శుభమగుఁ దుమ్ముచుఁ
    గూర్చుండిన నీళ్లకడను § గొణుగుచు నుండన్
    నాచుక జగడముఁ జేసిన
    శ్రీచతురా! కార్యహాని § శిఖినరసింహా,82

  1. దాచిన బంగారు ఫలము తరుణలనటనల్