పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

శ కు న శా స్త్ర ము


క. వర సౌమ్యునిపై బల్కిన
   నరులకు శుభఫలము లెందు § నయముగ వెలయున్
   సరిలేని సౌఖ్య మమరును,
   సిరి వరదా శుభము లివియు § శిఖినరసింహా72

తా. ఓ సరసిఁహస్వామీ! బుధుని మీఁద పల్కినను, తుమ్మినను
శుభప్రదము సకల సౌఖ్యములు గల్గును.

క. సురుగురు పైఁ బలికినచో
   నిరతము ధనదాన్య వస్త్ర § నిచయము కలుగున్
   ధరణీశుల మన్ననలగు
   సిరి వరదా సౌఖ్య మెసఁగ § శిఖినరసింహా.73

తా. ఓ నరసింహస్వామీ! బృహస్పతి మీద పల్కినను తుమ్మి
నను ధనధాన్య వస్త్రలాభము రాజసన్మానము గల్గును.

క. మృష్టాన్నంబును ద్రవ్యము,
   నిష్టంబగు ఫలము సౌఖ్య § మెప్పుడు గలుగున్
   పుష్టంబుగ శుక్రునిపై ,
   సృష్టీశా శుభకరంబు § శిఖినరసింహా.74

తా. ఓ నరసింహ స్వామి! శుక్రుని పై బల్కినను, తుమ్మినను,
మృష్టాన్నలాభమును సౌఖ్యమును సిద్ధించును.

క. శనిపై బల్కిన దుమ్మిన
   ఘనమగు రోగంబుఁజింత § కష్టము లేవుడున్
   బెనఁగొని వడిఁబీడించును,
   చినయోబళగిరి విహార § శిఖినరసింహా.75

తా. ఓ నరసింహస్వామి ! శని పైఁ బల్కి నను తుమ్మినను విచా
రము రోగములు పట్టిపీడించును.