పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ కు న శా స్త్ర ము

23

తా, ఓ నరసింహస్వామీ! రాహువు ఆది, గురు, వారములందు
తూర్పు దిక్కునందున , శుక్ర,సోమవారములందు దక్షిణ దిక్కునం
దును, మంగళవారమునందు పడమర దిశయందును, బుధ శనివార
ములందు ఉత్తరదిశ యందును, ఉండును.

-: న వ గ్ర హ గౌ ళి:-



క. మానవుల తుమ్ముగౌళీయు ,
   భానునిపై బల్కె నేని § బహులంపట తా
   బూనిన పని కానేరదు,
   శ్రీనాథా నిశ్చయఁబు § శిఖినరసింహా.69

తా.ఓ నరసింహస్వామి! సూర్యునిమీఁద తుమ్మినను,గౌళి
పల్కినను, తలంచిన పని కానేరదు, బహుకష్టములు కలుగును.

క. చుట్టములు వత్తు రెప్పుడుఁ
   బట్టిన కార్యంబు జయము § బహు శుభమమరున్
   గట్టిగఁ జంద్రుని ఫలమిది
   చిట్టౌ బళగిరి విహార § శిఖినరసింహా.70

తా.ఓ నరసింహస్వామీ! చంద్రునిపై తుమ్మినను,గౌళి పలికి
నను, బంధువుల రాకయు, కార్యజయము గల్గును.

క. భూపుత్రునిపై బల్కిన
   నాపదలకు మూలముగుచు § నలగుట జాడ్యం
   చేపట్టున కలహంబగు
   జేపట్టదు ఫలమొకింత § శిఖినరసిఁహా.71

తా. ఓ నరసింహస్వామీ! అంగారకుని పై పల్కినన , తుమ్మినను
ఆపదలు, కలహము కలుగును,