144
వెలుగోటివారి వంశావళి
గుహధనంజయభీష్మగురుభుజాబలశక్తి శాసించు[1] నెవ్వాని శౌర్యగరిమ శరదభ్రతనదభ్రకరిసితాభ్రద్యుతి గర్హించు[2] నెవ్వాని ఘనయశంబు చండతరవైరిరాజన్యకాండగంధ సింధురచ్ఛేదనోదగ్రసింహ మతఁడు[3] మేటిమన్నీఁడు[4] మావెలుగోటిరాయఁ దేచభూపాలునికుమార యేచఘనుఁడు.
నీభేరిభాంకృతు ల్నిండి వీనులఁ బర్వ నుల్లంబు జల్లనఁ దల్లడిల్లె మిఱుమిట్లుగొల్పు నీమేటిడా ల్గనుఁగొన్న ఘనభయంబున మహాకంప మొందెఁ గళకళమను నీదు కైజారుఁ[5] జూచినఁ గడు దప్పి దప్పని కలువరించె సింగిణి విడివడి[6] రింగురింగున వచ్చు నీచే లకోరీల నేటు బెడిసె[7] బెదరి పఱువెత్తి దగఁ దొట్టి బెగ్గలింప దఱిమి నఱకవె[8] మైసూరిదళము నెల్ల సకలబిరుదాంక వెలుగోటిశాసనాంక యేచభూపాలునికుమార యేచధీర.