పుట:వెలుగోటివారి వంశావళి.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

143


కలయన్[1] గొల్వని మన్నెవారుఁ గలరే కర్ణాటభూమండలిన్
వెలుగో టేచమనేనియేచనృపతీ వీరప్రతాపోన్నతీ.

426


సీ.

శరణు కాకితరాజ్యసంస్థాపనాచార్య[2]
        పాలించు గాయగోవాళబిరుద
మన్నించు పరిపంథితమన్నెకాలాంతక[3]
        రక్షించు ఖడ్గనారాయణాంక
ప్రాణదానము సేయు ప్రతిగండభైరవ
        కావు మాశ్రితజనకల్పభూజ
కరుణించు వైభవాఖండలసంకాశ
        కృపఁ జూడు రేచర్లకులపవిత్ర[4]
యనుచుఁ బ్రత్యర్థిపరులు నీయడుగుఁదమ్ము[5]
లాశ్రయింతురు వినతులై యనుదినంబు
సమరనిశ్శంక వెలుగోటిశాసనాంక
రణజయోత్సంగ యేచభూరమణురంగ.

427


వ.

అతనికుమారుండు.

428


శా.

దిట్టైనట్టి కుమారయేచవసుధాధీశప్రభానాధ నీ
పట్టెం బాహవభూమి శాత్రవమహీపాలాగ్రకంఠంబులన్
గొట్టన్ బెట్టను మట్ట మెట్ట రిఫులం గ్రోధించి తద్దేహముల్
దట్టించున్ విదళించుఁ జించును మహోదగ్రప్రతాపంబునన్.

429


సీ.

నలజయంతవసంతనలకూబరుల చెల్వు
        సాధించు నెవ్వాని చక్కఁదనము
సురధేను సితభాను హరిసూనుల వితీర్ణిఁ[6]
        దలపించు నెవ్వాని దానమహిమ

  1. A.B. కలిత
  2. A.B. భరణుకాకిత రాజు రాజ్యస్థాపనాచార్య
  3. A.B. కాలాంతర
  4. ఇచ్చట కవి 'ఋ, ఉ' లత యతిమైత్రిని గల్పించెను
  5. A.B. నీయడుగుదలాశ్రయింత్తు
  6. V.V.C.చాగంబు