పుట:వెలుగోటివారి వంశావళి.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

వెలుగోటివారి వంశావళి


గాచు శరణన్నవారిని బ్రోచుఁ దనదు
దండఁ జేరిన యరిరాజమండలమును
మండలంబున రంగభూమండలేంద్రు
యాచభూపాలశౌరి దయావిహారి.

422


సీ.

పాఱువేఁటలు రాచబారు లెల్లను నీకు
        పట్టుగొఱ్ఱెలు గదా పగఱ కరులు[1]
వీటితోఁటలు గదా మేటైన కోటలు
        కాకు లాఠాణేల మూఁక లెల్ల
పన్నన్ను లామన్నెపాళెల సొమ్ములు
        నమ్మినకాఁపు లాకమ్మదొరలు
పెండ్లిండ్లు గా నీకు భీకరకదనముల్
        ప్రతిన గదా రామరాయపట్ట
మౌర ముగురు దునేదారు లయిన [నిన్ను]
నెదుర లేరన[2] యతిరాజు ఎదురగలఁడె
బాంధవుల నన్నదమ్ములఁ బాసి చనియెఁ
బరహితాచార వెలుగోటి పురవిహార
రంగధాత్రీశు నేచధరాతలేంద్ర.

423


మ.

బెగడెన్ గర్మిలి సత్యవీడు వడిఁ గంపించెన్ బటాపంచలై
పగలం బాఱెను జెంజి మించి మధురాపర్యంతరాష్ట్రంబులన్
దిగులెత్తెన్ గడిదుర్గముల్ వణఁకె భీతిం జగ్గరాజాదిరా
చగముల్ రంగయయేచశౌరి కెదిరించం లేక పాఱాడఁగన్[3].

424


వ.

అతని కుమారుండు.

425


మ.

దళితారాతినికాయ నీ గెలుపు వింతా యెంత నీతండ్రిచేఁ
గలనన్ నెగ్గని రాజులున్ బిరుదువ్రక్కల్[4] గాని దుర్గాధిపుల్

  1. B. కురులు
  2. A.B. యెదురజాలరుమోదటి
  3. A. పారెండుగన్
  4. A. వక్కల్