పుట:వెలుగోటివారి వంశావళి.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

141


నీకు ముత్యాలపేరులై నిలిచె నౌర
మత్తరిపుమస్తవిన్యస్తమణికిరీట
సురుచిదీప్తపదాంక[1] కస్తూరిరంగ
విభునిసత్పుత్ర యేచపృథ్వీకళత్ర.

418


ఉ.

గొబ్బురి జగ్గరాజు లోకకోటి మ ఱేఁబదికోట్లు మాక రా
జబ్బలు నూఱుకోట్లపయి నాఱ్వురు[2] రావెల వెంకు లైన హ
న్నిబ్బరగండఁ[3] డేచధరణీశ్వరు ముందఱ నిల్వ శక్యమే
గబ్బులు గాక బెబ్బులిముఖాముఖి మేఁకలు నిల్వ శక్యమే.

419


ఉ.

కబ్బిని నుండు నీతరము గాదు రణస్థలి మాకరాజ నీ
గబ్బితనంబు మారు మవకార్యము రావెల వేంకటాద్రి యో
గొబ్బురి జగ్గరాజ మనకుం దగ దీపగ యేచశౌరితో
బెబ్బులి డాసి మచ్చరముఁ బేర్చఁగఁ జింకల[4] కోర్వవచ్చునే.

420


ఉ.

ముప్పదివేలు వీరభటముఖ్యులు దాపుల పాపశౌరితో
ముప్పది యంచు మించి గడు[5]మూర్ఖతఁ జేరిన రెండువేలతోఁ
జొప్పడ నిల్చి తీవు[6] [రణ]శూరత, నీ ప్రతీమన్నెవాఁడు లే
డప్ప భళీరె[7] రంగవసుధాధిపుయేచనృపాలశేఖరా.

421


సీ.

త్రొక్కించు గడిమన్నెదుర్గముల్ హయముచే
        దిగదిగమని పెల్ల లెగయుచుండ
దరికొనఁజేయు నుద్దండవిరోధిరా
        ణ్ణికరపట్టణవహ్ని నింగి కెగయఁ
దలలు చక్కాడుఁ బ్రత్యర్థిరాజకుమార
        వర్గంబు దోర్గర్వవైఖ రెసఁగఁ[8]
బట్టించుఁ జెఱఁ బెట్టి దట్టించి రిపురాజ
        కోటిని మిక్కిలి నీటుఁ జూపఁ

  1. A.B. చారుశీల
  2. B. Stops with మాకరా. The Sources of Vijayanagara History (P 808) లక్షమీద బదియార్గురు
  3. B. మానిబ్బరగండ
  4. A.B. బేర్చుక చింన్నల
  5. A.B. మించివడు
  6. A.B. జొప్పడనిల్చితివి
  7. A.B. రిరె
  8. A.B. రాజన్యకుమారవర్గముల్ దోర్గర్వవైఖరులను