పుట:వెలుగోటివారి వంశావళి.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

వెలుగోటివారి వంశావళి


సీ.

వారజీతమెకాని బారునా కేలని[1]
        చినరౌతు మొనలకు జేరవెఱచు
నూడిగమేకాని కూడ వీపను లని
        యెప్పుడో జరిగె నాతిప్పరౌతు
మణియ మంతేఁగాని[2] మా కిది కాదని
        గుట్టుగాఁ దిత్తెపసెట్టి[3] కదలెఁ
బాళిగాఁ డై తాను[4] బ్రదికేది లెస్సని
        చిట్టాడ కడలె నాగట్టిమొదలి[5]
మఱియు నక్కిరి[6] దొర లిటు మార్గముననె
వట్టి మూఁకలు నీమీఁదఁ నెట్టుకొనునె
వైభవబిడౌజ రంగభూవరతనూజ
హిమకరాకార వెలుగోటి యేచధీర.

417


సీ.

పాఠక[7] సుకవీంద్రబంధువిద్వజ్జనా
        శ్రయమూలమైన[8] రేచర్లపేరు
పరిపంథిరాజన్యపట్టణోద్ధత[9]వీర
        రణజయార్జితమైన[10] రావుపేరు
సకలదిగ్భూముల జనులు సన్నుతి సేయఁ
        గరమొప్ప గని యేలఁ గనినపేరు
విక్రమక్రమకళా[11]విర్భూతమహిమలఁ
        గోరి తెచ్చిన వెలుగోటిపేరు

  1. A. యెమరజాతికాని బామనారేలని
    B. యెమరజాతికాని బారునాదులని
  2. A.B. మ్మెతేగాని
  3. A.B. తాతితపశెట్టి
  4. A.B. పాళెగాడెందైన
  5. A. చిట్టడికదిలెనా మోదలి B. ...మోదరి
  6. A.B. దక్కిన
  7. A.B. పాడగ
  8. A.B. ధారములలైన
  9. A. పట్టకోహత
  10. A.B. జయార్థితమైన
  11. A.B. కఠా