పుట:వెలుగోటివారి వంశావళి.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

139


విఱిగి వీరవిభుండు చిరుతనాపలిఁ జేరి
        దిడ్డి[1]తూరుపుదిక్కు దెఱవ వెఱచెఁ
దన ప్రాణములు దాఁచుకొని చెంజికృష్ణప్ప
        వీఁగి యెన్నఁడుఁ గోట వెళ్ల వెఱచె
నమ్మినదొర లటు నట్టేటఁ[2] బడిపోవ
        గోటకాఁ డొక్కండు గూటఁ బడియె
శాకతమూరులు రావెలల్[3] మాకరాజు[4]
వారు దిక్కామొగంబులైనారు[5] జడిసి
ఔర! తోపూరుపాళెంబు లదుర నీవు[6]
త్రోచి నడిచిన వెలుగోటి యేచభూప.

415


సీ.

రాజులలో జగ్గరా జని మొనఁ బడెఁ[7]
        దప్పెఁ గార్యంబు వీరప్ప నేఁడ
పదపద చిరుతనాపలిచేరఁగావలె
        మాకరాజు గుఱాని నూకె మొదల
ఏనుఁగు నెక్కుట మానుక దళవాయి .
        తాఱెను దనదు బిడారిబైట[8]
రావెల వెంకన తా వెళ్లసాగెను
        పోయి మున్నుగ దెరువీయనొక్కఁ[9]
డనుచుఁ గృష్ణపనేఁడు ము న్నాడి తెలుప
జాఱు వీరపనేఁడు నీబారుఁ[10] జూచి
వైభవబిడౌజ రంగభూవరతనూజ
హిమకరాకార వెలుగోటి యేచభూప.

416
  1. A.B. దిండు
  2. A. నట్టట
  3. A. వెలమారు
  4. B. మారరాజు
  5. A. దిక్కామెకంబులైనారు; B. తిక్కమెకంబులైనారు
  6. A.B. ఔర నీవు తోవూరుపాళెంబులదుర
  7. A.B. మోనఁబడెను
  8. A.B. ఏనుఁగు నెక్కేది మనకు రాదుసుమీ చానేను మనకు బిడారిబైట
  9. A.B. పాయిమున్నుగదరు వాయనొకండు
  10. A. నీజారు