పుట:వెలుగోటివారి వంశావళి.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

వెలుగోటివారి వంశావళి


నేఁడుగా భువియందు[1] నెగడె సర్వజ్ఞ సిం
        గమనేని[2]సంతానగౌరవంబు
నేఁడుగా మదిఁగల్గు నెవ్వ లన్నియుఁ[3] దీఱి
        విలసిల్లె ఘనమైన వెలమపేరు
నీవు కర్ణాటకంబుననిలిచినపుడు
రాయవిద్వేష గర్వదుర్వారవైరి
కోటిఁ బరిమార్చి గెల్పుఁ జేకొనినకతన
హితమతాలాప వెలుగోటి యేచభూప.

413


సీ.

దళవాయికిని వెఱ్ఱి గొలిపి వచ్చినవాని[4]
        పట్టంబు గట్టుకొన్నట్టినాఁడె
గుమిగూడి వేలూరికోటలోఁ గల యీటె
        యాబుళేశుని[5] ద్రుంచినట్టినాఁడె
నిండారమగు[6] రాయభండార మెల్లను
        నాక్రమణము[7] సేసినట్టినాఁడె
పుత్రమిత్త్రకళత్రపుంజంబు రాయల
        నరయగ[8] వధియించినట్టినాఁడె
చచ్చె నీచేత గొబ్బూరి జగ్గరాజు
పాఱిపోఁబట్టి రెండేండ్లు బ్రదికెఁ గాక
లలితచారిత్ర వెలుగోటి కులపవిత్ర
హితమతాలాప రంగయయేచభూప.

414


సీ.

నీహేతిచే జగ్గనృపతి సద్గతిఁ బొంది
        పాపాత్ముఁడను[9] నిందఁ బాపుకొనియె

  1. A.B. భరియించి
  2. A.B. సింగభూజాని
  3. A.B. నవతలన్నియు
  4. A. దళువాయకుని వెఱ్ఱి గొడ్వింపెడు వానిపట్టంబు
  5. A.B. నాబిలేశుని
  6. A.B. నిండారమైన
  7. A.B. నాక్రమ్యముగ
  8. A.B. పుంజమ్ములను రాయలరోయక
  9. A.B. ప్రాశ్చలన