పుట:వెలుగోటివారి వంశావళి.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

137


మ.

సంతతి యేచమనేఁడు మొదలు.

410


ఉ.

రంగయయేచశౌరి రణరంగధనంజయుఁ డుద్ధతారి[1] సా
రంగమృగేంద్రుఁ డర్థిజనరక్షణదక్షవితీర్ణి[2] బంధుసా
రంగపయోధరంబు రతిరాజమనోహరమూర్తి పూర్ణసా
రంగధరాభకీర్తి సుగుణాభరణుండు నృపాలమాత్రుఁడే.

411


[3]సీ.

సింహాసనమునకుఁ జిత్తంబులో నొండు[4]
        దలఁచు ద్రోహుల ఱొమ్ముఁ దన్నినాఁడు
మదిలోన క్రొవ్వి ఛద్మనకార్య మూహించు
        చెనటుల జిహ్వలు చీల్చినాఁడు
మొనలు తారసమైనఁ గని స్మయంబున[5] నీగు
        చండిమన్నెలవెన్నుఁ[6] జఱచినాఁడు
ఎదిరించు మన్నీల నేపునఁ బడి పుట్ట
        చెండ్లు గొట్టినరీతిఁ జెండినాఁడు
మన్నెమాత్రుండె యితఁ డరిమర్మభేది
మన్నెబెబ్బులి గడిమన్నె మగలమగఁడు
సమరగాండీవి వెలుగోటి శాసనుండు
రంగభూపతి యేచధరావిభుండు.

412


సీ.

నేఁడుగా తలపూలు వాడకెంతయుఁ[7] జాల
        నలరెను బద్మనాయకకులంబు
నేఁడుగా భువనవర్ణితమహాభూతితోఁ[8]
        గొమరొందె రేచర్లగోత్రమెల్ల

  1. A.B. ధనంజయుఁడు ధతారి
  2. A.B. దక్షలతీర్ని
  3. A. The scribe has by mistake copied at the beginning of this verse the first line of కందవోలును గుత్తి; and this has been repeated in B.
  4. A.B. రెండు
  5. A. భరంబున; B. భయంబున
  6. A.B. రొమ్ము
  7. A.B. వాడకంతయును
  8. A.B. మహెద్భుతతోడ