పుట:వెలుగోటివారి వంశావళి.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

వెలుగోటివారి వంశావళి


ఉదయాద్రి నెల్లూరు నోరుగల్లును[1] జొస్తి
        పరు లెన్న సంగ్రామపరశురామ
కటకము డిల్లియుఁ గాశికాపురిఁ జొస్తి
        తాల్మితో రిపుగజదళవిభాళ
ఎలమి నీతోడ డీకొన నెవ్వఁడోపు[2]
భావజాకార విక్రమార్కావతార
వరగుణాధార[3] రంగభూవరకుమార
ప్రాభవోపేంద్ర యేచభూపాలచంద్ర.

406


వ.

అతని యనుజుండు.

407


సీ.

మత్తారిరాజన్యమస్తకంబులఁ గాని
        పూజసేయఁడు యుద్ధభూతలంబు
రాపాడు శత్రుల రక్తధారనేెకాని
        యోలలార్పఁడు భూతజాలములను[4]
మలయు విరోధుల మాంసంబులే కాని
        మేఁత వెట్టఁడు కాలమృత్యువునకుఁ
గపటారి[5]కాంతల కంటినీరునఁ గాని
        కడుగ నొల్లఁడు చేతిఖడ్గధార
నౌర! సాహసగుణవిక్రమార్కనిభుఁడు
మన్నెగజసింహుఁ డభియాతి మన్నెమావు
సమరవిజయుండు వెలుగోటిశాసనుండు
చిత్తజనిభుండు రంగయ సింగఘనుఁడు.

408


ఉ.

భంగనవీనఫేనఫణిభర్త ధురంధరదుగ్ధవారిరా
శిం గని హంసశుభ్రసరసిం గని శైలకుమారికావిలా
సిం గని లాంగలస్ఫురదసిం గని కల్పపటీరరాట్పలా
శిం గని[6] నవ్వు రంగవిభుసింగనికీర్తి మనోహరద్యుతిన్.

409
  1. A.B. వోరుగల్లును
  2. B. Stops with యెలమినీతో
  3. A. వరజునాదార
  4. B. రాపాడు శత్రులరక్తధారలెకానిర్వండు భూతజాలమునకు
  5. A.B. కపటరి
  6. A.B. కృత్తిపటీరరాహవాశింగని