పుట:వెలుగోటివారి వంశావళి.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

135


వ.

ఆసాధ్వీరత్నంబునందు కందర్పనిభుఁ గుమారరంగవిభుని ధాటిగాఘోటి
కాఖురశిఖరచూర్ణితదిగంతు నేచభూకాంతు గీతికాసాహితికారసవిశాలు
సింగభూపాలు గాంచె నమ్మువ్వురు[1] భువనత్రయంబు కరణి హరిహరహి
రణ్యగర్భుల సరణి ప్రసిద్ధి గని రం దగ్రజుండు.

402


ఉ.

ప్రేమఁ గుమారరంగమహిభృన్మణి దానకళావిలాస మి
చ్ఛామతి[2] నభ్యసింప నొకచక్కి వసించి గ్రహింపలేవ చిం
తామణికామధేనువిబుధద్రుమముల్ దముఁ జూడఁ బ్రస్తర
గ్రామపశుద్రువర్గములుగావె మహాగుణముల్ లభించునే[3].

403


సీ.

తేజఃక్షమాభోగధీరూపములయందు
        శ్రీధరేంద్రాత్మభూస్థేమఁ దనరి
నయకాంతిబలశీల[4]నరనాథజయములం
        గురురాజబలహరి సరణిఁ దాల్చి
హరిభక్తిగరిమదాన[రుచిసంపద]లందు
        గిరిజేశఘనమిత్రనిరతిఁ బూని[5]
చటులధృతిస్థైర్యసౌజన్యకృపలందు
        పవిధరారామద్రుతపటిమ నెరసి[6]
వెలసె ఘనశరకులదృఢదళనకలన
వల సయోడ్యాన తరవారి పటువిహారి
సరస వెలుగోటికులవార్ధి జలరుహారి
రసికభయహారి రంగయ రంగశౌరి.

404


వ.

అతని యనుజుండు.

405


సీ.

కందనోలును గుత్తి గండికోటయుఁ జొస్తి
        నీతితో లోభిమన్నీలమిండ
గోలకొండయు మఖ్ఖ కొండవీడును జొస్తి
        కరమరి బలరగండబిరుద

  1. A. నన్పుప్పురు B. మృప్పురు
  2. B. మిచ్యామతి
  3. A. వెలయందపెరినన్ బంధించునే B. వెలకుందపిరిన్ లభించునే
  4. A.B. బల(ళ)కలా
  5. A.B. హరిభక్తి గరిమదానములందు గిరిజేశఘనమిత్రనియతిబూను
  6. A.B. చట్టులధృతితార్క్షసౌజన్యకృపలయందు వివిధభోజనకపటిమ నెనశి