పుట:వెలుగోటివారి వంశావళి.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

వెలుగోటివారి వంశావళి


సీ.

జైత్రయాత్రాసమిజ్జయద భేరీభూరి[1]
        ధణధణధ్వనిచేత దద్దరిల్లి
ధాటీనిరాఘాటఘోటికా[2]ఖురస ము
        ద్ధూతధూళిపాళి[3]చేత బెగడి
మదగంధలోలుపమధుకరోన్మాదిత
        కలభఘీంకృతులచేఁ గలువరించి[4]
పరధనుర్ధరజుయావష్టంభరణ[5]ధను
        ష్టంకారములచేతఁ జాలఁ బ్రమసి
తిరిగి చూడక వివిధదిగ్దేశములకు
నాత్మజాయాసమాకృష్టహస్తు లగుచుఁ
బరువులెత్తిరి శత్రులౌ ధరణిపతులు
సంగరాటోప వెలుగోటిరంగభూప.

398


వ.

అతనియనుజుండు.

399


ఉ.

వ్యాలవిభుడు ధీమహిమ నప్రతిమప్రతిగండభైరవా
భీలపరాక్రమాఢ్యుఁడు గభీరగుణాభరణుండు గాయగో
వాళజయాంక[6]శౌరి యతివైభవుఁ డవ్వెలుగోటియేచభూ
పాలకుతిమ్మశౌరి రణపార్థుఁడు పార్థివమాత్రుఁడే భువిన్.

400


గీ.

ఆకెవీటితిమ్మభూకాంతునకు నగ్ర
జాతుఁడైన రంగజనవిభుండు
తగ వివాహమయ్యె దామెర వెంగళో
ర్వీకళత్రు[7]పుత్రి వేంకటాంబ.

401
  1. A.B. సముజ్ఞయనభేరిభూరి
  2. A.B. ఘోటి
  3. A.B. సమధూతధూరిపాలి
  4. A.B. మదగంధలుబ్ధఘటభటత్కరి(ఖే)భేంద్రియలచేత కలువరించె
  5. A.B. గణ
  6. A. గో | వామజయాంక
  7. A. వెంగళోక్వాకలత్రు