పుట:వెలుగోటివారి వంశావళి.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

133


శా.

పట్టాధీశులు నొచ్చి వచ్చినను జేపట్టన్ విరోధించి యి
ట్ట ట్ట న్నంతనె మట్టుపెట్ట నసహాయంబైన శౌర్యస్థితిన్
బట్టౌ యా[1]వెలుగోటి యేచవిభుకుం బట్టైనరంగప్పఁ డో
బట్టా వానిప్రతిజ్ఞ లే దనఁడు రా ప్రత్యర్థికి న్నర్థికిన్[2].

395


మ.

అరుదౌ నీబిరుదప్రబంధములు[3] గల్యాణాద్రిపై యక్ష[4]కి
న్నరగంధర్వసతుల్ సదాశ్రుతిఫుటానందంబుగాఁ బాడఁగా
నర రే! బాపు! భళీ! సెబా! సహహ! యౌరా! మే లహో! యందురా
హరిదీశుల్[5] వెలుగోటియేచవిభురంగా సంగరక్ష్మార్జునా.

396


సీ.

కిల్లాకు నంపితే డిల్లీకటకగౌళ
        మేదినీశులనామజాదు[6] వచ్చు
నీలిపోఁ గంపితే[7] నేపాలమండువా
        పండువాసృపతులపంపు వచ్చు
ముఖవార్తఁ బంపితే[8] ములువాయకోలాల
        మలయాలభూములమంది వచ్చుఁ
జీటిఁ బెట్టంపితే సింధుకేరళచోళ[9]
        పాండ్యరాజుల యంగబలము వచ్చు
దముకు వేయించితే దిగంతముల[10] నున్న
రాయమన్నీలు వత్తురు కూయి బడిగ
భూవిభునిమాత్రుఁడే మనుష్యావతార
రంగవిభుఁ డుర్వి వెలుగోటిరంగవిభుఁడు.

397
  1. A.B. బట్టయ్యా
  2. A.B. ప్రత్యర్థికిన్ అర్థికిన్
  3. V. P. Sastri (Cmmr p. 59) ప్రతాపములు
  4. V. P. Sastri (Cmmr p. 59) నుండి
  5. A.B. అరిధీశుల్ ; V. P. Sastri (Cmmr p.59) రయ్యరివీరుల్
  6. A.B. నామజాజు
  7. A.B. నూలిపోగంపితె
  8. A.B. (న)దిప్పితె
  9. B. కేరళూడ
  10. A.B. తముకు వేయించితే డిగంతములనున్న