పుట:వెలుగోటివారి వంశావళి.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

వెలుగోటివారి వంశావళి


సమయుఁ జీకాకువడుఁ బాఱు జలదరించు
నౌర కస్తూరిరంగ సాహసతరంగ.

391


సీ.

కొండవీడాది విన్కొండ[1]మన్నీలను
        గొట్టవా కొచ్చర్ల కోటఁ జేర
రాయమన్నీల నిర్వది[2]యాఱువేలను
        దునుమాడవా క్రొత్తకనుమలోన[3]
రాయల కొడ్డైన[4] రసికతమ్మపగౌని
        కప్పమందవె యొక్కగడియలోనఁ
బండ్రెండువేలకాల్బలముతో వచ్చినఁ
        దెగటార్పవా మట్ల తిమ్మఘనుని
గోనవంకర్ల[5] చల్లల కూనపులులఁ
దాసరేంద్రుని తిమ్మనిఁ దఱిమి తఱిమి
జయముఁ జేకొన్న వెలుగోటిసార్వభౌమ
విమతమదభంగ యేచభూవిభునిరంగ.

392


శా.

ఈక్షోణిన్ శశిముఖ్యరాజకులమున్ హింసించి తద్రక్తముల్
సాక్షాద్రాముఁడు రెండుమూఁడుమడువుల్ గావించె నేఁడొండు ప్ర
త్యక్షించెన్[6] వెలుగోటిరంగఁ డురుబాహాహేతిఁ గోడూరివీ
రక్షేత్రంబున రాచపించ మణఁచన్ రక్తప్రవాహంబుగన్.

393


ఉ.

అట్టిటుఁ బోవనీక విజయాద్భుతవిక్రమవిక్రమార్కుఁ డై
తిట్టులె కుట్టిన ట్లొరయు[7] దిట్టల పొట్టల సంగరస్థలిన్
దెట్టలు గట్టఁ గూల్చు రణధీరుఁ డొకం డిఁకఁ[8] గల్గనేర్చునే
రట్టడి యేచభూవిభునిరంగఁడె కాక వసుంధరాస్థలిన్.

394
  1. A.B. వినికొండ
  2. A.B. యిరువది
  3. A.B. నురుమాడకొత్తకన(ను)మలోన
  4. A.B. రాయలకువొడైన
  5. A. గొనవంకరచల్లల B. గొనవంకరీచల్లల
  6. A.B. ప్రత్యక్షించి
  7. A. తిట్టులెగుడ్డినట్లొరయ B. తిట్టితెగుడ్డినట్లారయు
  8. A.B. ధీరుండాకండిక