పుట:వెలుగోటివారి వంశావళి.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

వెలుగోటివారి వంశావళి


గుహధనంజయభీష్మగురుభుజాబలశక్తి
        శాసించు[1] నెవ్వాని శౌర్యగరిమ
శరదభ్రతనదభ్రకరిసితాభ్రద్యుతి
        గర్హించు[2] నెవ్వాని ఘనయశంబు
చండతరవైరిరాజన్యకాండగంధ
సింధురచ్ఛేదనోదగ్రసింహ మతఁడు[3]
మేటిమన్నీఁడు[4] మావెలుగోటిరాయఁ
దేచభూపాలునికుమార యేచఘనుఁడు.

430


సీ.

నీభేరిభాంకృతు ల్నిండి వీనులఁ బర్వ
        నుల్లంబు జల్లనఁ దల్లడిల్లె
మిఱుమిట్లుగొల్పు నీమేటిడా ల్గనుఁగొన్న
        ఘనభయంబున మహాకంప మొందెఁ
గళకళమను నీదు కైజారుఁ[5] జూచినఁ
        గడు దప్పి దప్పని కలువరించె
సింగిణి విడివడి[6] రింగురింగున వచ్చు
        నీచే లకోరీల నేటు బెడిసె[7]
బెదరి పఱువెత్తి దగఁ దొట్టి బెగ్గలింప
దఱిమి నఱకవె[8] మైసూరిదళము నెల్ల
సకలబిరుదాంక వెలుగోటిశాసనాంక
యేచభూపాలునికుమార యేచధీర.

431
  1. B. శక్తి నాశించు
  2. B. గరించు V.V.C. ఘర్షించు
  3. B. సింహమనఁగ
  4. A. మోటిమాన్నీడు
    B. మేటి మాన్నీడు
  5. A.B. కైజతము
  6. A.B. విడివిడి
  7. A. నిచెలకారిలం నితివెడశి B. నిచెలకారిలంనింతివెడశి
  8. A. తరమినకవె B. తరలినకవె