పుట:వెలుగోటివారి వంశావళి.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

145


ఉ.

స్వామి కుమారయేచ రిపుజై త్రధనంజయ[1] నీపరాక్రమం
బే మని చెప్ప[2] మైసురిమహీశుబలంబులు దారసిల్లినన్
చామలి[3] సంగరంబునను జానుగఁ ద్రుంచితి వౌర! రెండు మూఁ
డామడ పట్టు నిండు పొలమంతయు[4] పీనుఁగుపెంట లేర్పడన్.

432


సీ.

మీతాతతండ్రైన మేటి యేచనృపాలుఁ
        డంచితసత్కీర్తి మించినాఁడు
రాణించు[5] మీతాత రంగభూపాలుండు
        పెంపైన రాజుల పించ మణఁచె
రాయపట్టము నిల్పి రహి రిపుఁ జెండాడె[6]
        నెంచఁగా మీతండ్రి యేచఘనుఁడు
మలకమూఁకల నెల్ల మహి నసాధ్యంబుగా[7]
        గెరలి పైకొని దిశల్ గెల్చితీవు[8]
పంచపాండ్య[9]విభాళసంప్రాప్తబిరుద
హాటకంబైన సింహతలాటరాయ
పార్థివోత్తమ ప్రతిగండభైరవాంక
యేచభూపాలవిభుకుమారేచభూప.

433


వ.

ఆచినతిమ్మానేని వంశావతారం బెట్టి దనిన.

434


క.

చినతిమ్మవిభునికూరిమి
తనయులు చెన్ననయుఁ దిమ్మధరణీశుఁడుఁ గొం

  1. A.B. జెయిత్త
  2. A.B. చెప్పవచ్చు, చప్పవచ్చు
  3. A.B. The first letter of the line lost, then we have బతి or బలి which does not agree with the prāsa. V.V.C. gives the name of the place of the battle as Chāmali.
  4. A. పెట్టనిందివాలమంతయు పినుగ పెంటతిర్వదన్
    B. పెట్టునిందివాలమంతేయు కినుగ పెంటతిర్వదనూ
  5. A.B. రాశించ్చు
  6. A.B. రాయపట్టమునిర్విరహరిపుచెండాడి
  7. A.B. మెదికిమూకలరెల్లమహీనసాద్యబైన
  8. A. కెరీలి వెకొను దిశగెల్చినావు; B. కెరీలివికానుదిశన గెల్చినావు
  9. A.B. పాండియ