పుట:వెలుగోటివారి వంశావళి.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

వెలుగోటివారి వంశావళి


డనరాధిపుఁడును బినకొం
డనయు వెలసి రవని నతిదృఢశ్రీమహిమన్.

435


వ.

సంతతికిఁ జెన్నప్పనాయఁడు మొదలు[1].

436


క.

అందునఁ జెన్నప్రభునకుఁ
బొం దమరఁగ మాలకొండభూపుఁడు పుట్టెన్[2]
అందంబు మీఱ నతఁడునుఁ
గందర్పుఁ గుమారచెన్నఘనునిన్ గనియెన్.

437


ఉ.

హల్లకవైరితేజ! యవునయ్య! భళీ! వెలుగోటిచెన్నభూ
వల్లభుమాలెకొండ! నెఱవాదివి నీవె వసుంధరాస్థలిన్
గొల్లలు గాఁగ సత్కవులు గోరిన కోరిక లిత్తు, వాజిలోఁ
గల్లరి శత్రుసంఘముల గర్వము వీడఁగ వ్రేతు వెయ్యెడన్.

438


వ.

అతని కుమారుండు.

439


శా.

నారీమన్మథ మాలకొండఘనుచెన్నా ని న్నుతింతున్ పయః
పారావారసముద్భవత్ప్రకటశుంభత్కుంభిరాట్ఘంటికా
ధారాళధ్వనిఘుంఘుమత్ఘుమితవాగ్ధారా[3]సుధామాధురీ
పూరంబుల్ దుముకాడు నట్లుగ నహో పుంఖానుపుంఖంబుగన్.

440


చ.

చలమున దాడిగా వెడలి చండవిరోధుల నుగ్గు నూచగాఁ
గలనను వ్రేయ నర్థులకుఁ గర్ణుని వైఖరి నర్థ మియ్యగాఁ
గలిగిన రాజె యీఘనుఁడు కారణజన్ముఁడు భట్ట యెంచరా
వెలుగొటిమాలెకొండపృథివీపతిచెన్నని రాయరాణువన్.

441


క.

[4]వారలలోఁ బెదకొండ
క్ష్మారమణుని కీర్తిహంసిక నిజాండగతిన్
నీరజభవాండమండలి
నౌరా! తన కుక్షియందె యలముకయుండెన్.

442
  1. This short prose passage is found after 437 in the Mss.
  2. A.B. భూవరుడుట్టెన్
  3. A.B. ధారాళద్ఘమిఘమితవాద్ధారా
  4. This stanza occurs before 437 in the Mss.