పుట:వెలుగోటివారి వంశావళి.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

147


వ.

ఆ పెదకొండప్పపద్యాలు.

443


ఉ.

నీతరవారి శత్రుధరణీపతి[1] దేహ వపారసంబునన్
జాతరుచిం జెలంగు విలసద్భవదీయయశోవధూటి యా
శాతటరంగభూములను జానుగఁ జిందులు ద్రొక్కు[2] సజ్జగ
ద్గీతకులప్రసూతి పినతిన్ముయకొండ యఖండవిక్రమా.

444


చ.

తలకొని యిచ్చి మ్రోడుపడు దాతలుఁ ద్రిమ్మరి పాదదాతలున్
జలకణనూత్రదాతలును జర్మము నెమ్ములు నిచ్చుదాతలున్
వెలవెలఁబోవు దాతలు భువిన్ బశుమార్గము నొందు దాతలున్
దెలియ సమంబుగారు పినతిమ్మనికొండని కివ్వసుంధరన్.

445


వ.

ఆరంగప్పనేని వంశావతారం బెట్టి దనిన.

446


క.

రంగక్షితిపతి సాక్షా
ద్రంగపతిం దెలిపె నతదురంతైకదయా
సంగతి సాత్వికయుతబు
ద్ధిం గమలావిభవసంభృతిన్ బరికింపన్.

447


వ.

అతనికుమారుండు.

448


సీ.

ఈభోగవైభవం బేరాజు కున్నది
        పాకారికే కాక నీకె కాకల
ఈకాంతివిలసనం బేరాజు కున్నది
        రాకేందునకె కాక నీకె కాక
ఈమహాగాంభీర్య మేరాజు కున్నది
        నీరధికే కాక నీకె కాక
ఈధైర్యధుర్యత్వ మేరాజు కున్నది
        నిర్జరాద్రికె కాక నీకె కాక
ధరణి నేరాజు కున్న దీదానగరిమ
నాకభూజంబునకె[3] కాక నీకె కాక

  1. A.B. సతి
  2. A. బానంగగజందులుద్రొక్కు B. బానంగగలందులుద్రొక్కు
  3. A.B. నాకభూనేభజంబునకు