పుట:వెలుగోటివారి వంశావళి.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

వెలుగోటివారి వంశావళి


భావభవరూప భువనదీప్తప్రతాప
సంగరాటోప వెలుగోటిసింగభూప[1].

449


సీ.

ఒరయు విద్వేషుల యూరు నాటకశాల
        మెఱయు భూతగణంబు మెట్టుకాండ్రు[2]
పగతుల నగరులు పటురంగమధ్యంబు[3]
        మలయు వైరుల ఱొమ్ము మద్దెలయును
దట్టించు రిపుకోటి తాళము ల్దాళముల్
        మజ్జారె[4] హేయను మాటమాట
కోయని పెల్లార్చుకొను నాదు ముఖవీణె
        భవదీయభుజలక్ష్మి పాత్ర గాఁగ
తక్క దిగి తక్కనఁగ[5] గీతతాళగతుల
నాట్యమాడించు నీఖడ్గనట్టువుండు
బవరతలమున రంగభూపాలపుత్ర
సంగరాటోప[6] వెలుగోటిసింగభూప.

450


వ.

అతని కుమాళ్లు.

451


శా.

ఔరా సింహతలాటరాయ భళి నిత్యాదార్యరాధేయ మ
జ్జారే సింగనృపాబ్ధిచంద్ర శుభవాచాసాంద్ర సేబా సహో
రారాజద్వెలుగోటివంశమణి మేల్[7] రా రామభద్రా గు[ణీ
నా]రీమన్మథ బాపు మాయురె మదాంధగ్రావవజ్రాయుధా.

452


ఉ.

వీరనృపాలగర్వహరవిక్రముఁ డంటినొ జగ్గరాజము
ఖ్యారివిభాళుఁ డంటినొ భయాహృత[8]రాజకిశోరుఁ డంటినో

  1. B. జంగభూప
  2. A.B. ముట్టుకాండ్రు
  3. A.B. పగరులు నగరులు పట్రంగమధ్యంబు
  4. A.B. మచ్చారె
  5. A. తక్కగిడితక్కనగ B. తక్కగిడితక్కనక్క
  6. A.B. యంగజాటోప
  7. B. మల్
  8. A B. దయాహృత