పుట:వెలుగోటివారి వంశావళి.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

149


చారుతరాంగసింగనృపసంభవుఁ డంటినొ కంతుచేతి పే
రారడి రామచంద్రుఁ డని యంటిని రం తొనరింతురా చెలీ.

453


వ.

అతని యనుజుండు.

454


సీ.

తుత్తుమురై రాలు ధూర్తారికోటీర
        పాళీ[1]మణుల పాంసుకేళి నెఱపు[2]
ఏఱులై ప్రవహించు వీరవైరినృపాల
        జాలరక్తంబుల నోలలాడు
వింతలై కనుపట్టు విద్వేషిభూపాంత్ర
        మాలికావళుల[3] నుయ్యాలలూఁగు
ఖండితోద్దండభూమండలాధిప[4]శిరః
        కాండంబులను బుట్ట చెండులాడు
మేలు మేలగు నీఖడ్గబాలకుండు
చటులతరకీర్తి నర్తకీనటనరంగ
రంగదాశాంత వెలుగోటిసింగవిభుని
వేంకటాద్రి క్షమాపాల విజయశీల.

455


సీ.

గరిడిలో సాములా గర్వితాహితపాండ్య
        దళవిభాళునితోడి బలిమిపోరు
సరసప్రసంగమా సంగరనిశ్శంక[5]
        బల్లరగండాంకుభటరవంబు
జలకేళులా సోమకుల భార్గవు కరాసి
        ప్రవిగళద్రక్త[6]ధారాళిఁ బడుట

  1. A.B. పాలి
  2. A. కీలినెరవు
  3. A.B. భూమాత్ర మాలికాలీల
  4. A.B. భూమండలాధిక
  5. A. లిశ్యంక B. విశ్వంక
  6. A.B. అతిగళద్రక్త