పుట:వెలుగోటివారి వంశావళి.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

వెలుగోటివారి వంశావళి


రత్నభూషణములా ప్రతిగండభైరవు
        నున్నతబాణక్షతోగ్రరీతు
లేల యీవట్టివైరంబు[1] చాలు ననుచు
మన్నె[2]రాజన్యు లెల్లను మఱుఁగుఁ జొచ్చి
సిరులఁ బెంపొంది రౌరౌర[3] సింగవిభుని
వేంకటాద్రిక్షమాపాల విజయశీల.

456


వ.

అతని కుమాళ్లు.

457


సీ.

శ్రీరస్తు సకలధాత్రీచక్రరక్షణ
        దక్షదక్షిణభుజాదండ నీకు
విజయోస్తు యాచకవ్రజఘోరదైన్యము
        ద్రాతమఃపటల[4]మార్తాండ నీకు
హరిభక్తి రస్తు సాహంకారపరిపంథి
        కంఠలుంఠనశాతఖడ్గ నీకు
[5].............................................
        ....................................
ఆయురస్తు సువైష్ణవాకేభ్యర్చనాభి
ధానమాధవమృదుపద[6]ధ్యానమాన
సాంబుజగరిష్ట వేంకటాధ్యక్షతనయ
మౌళి వెలుగోటిసింగభూపాల నీకు.

458


సీ.

చివు చివుక్కన వచ్చు సింగాణికోలల
        మదహస్తి నెదురఁగా నుదుటు[7] చేసి

  1. A.B. యీవంట్టివైరంబె
  2. A.B. మున్నె
  3. B. తౌకార
  4. B. ముద్రాతవె...గటల
  5. The last line is missing
  6. B. వలలృదుద
  7. A.B. నిదుట