పుట:వెలుగోటివారి వంశావళి.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

151


ఱింగుఱింగనుచుఁ బాఱెడు తుపాకీగుండ్ల
        నెఱి లెక్కగొనక ముందఱకు హెచ్చి[1]
బెఱబెఱమంచును భీకరధ్వనులతోఁ
        గవయు బల్బాణంబురవళిఁ గెరలి
మొత్తమై బలువాఁడికత్తుల నొప్పురా
        హుత్తసంఘములపై నుఱికి నఱికి
మలక పంపుల గెలిచితౌ మాఱు లేక
రమణ నార్వీటి శ్రీరంగరాయశౌరి
సెలవుఁ బెట్టిన వెంగంటిచెఱ్వులోన
ధీర వెలుగోటి వేంకటాధిపునిసింగ.

459


సీ.

కఱకు సిలేదార్ల 1 కంఠరక్తంబులు
        చండి వజీర్ల మాంసంబు తురుము
రవ్వ దునేదార్ల క్రొవ్వు లప్పలరాసి
        మెం డొడ్డు ఖాజీల[2] మెదడు కుప్ప
బిరుదురాహుత్తుల ప్రేవుల ప్రోవులు
        ఖండరిఖానుల కండగుదులు
గొంటరి సరదార్ల గుండెల కఱకుట్లు
        మొక్కలి[3] సైదుల మూలుగులును
భుక్తి వెట్టితి వౌ ఖడ్గభూతమునకు
గణన కెక్కిన వెంగంటి రణమునందు
భళి భళిర పంచపాండియదళవిభాళ
ధీర వెలుగోటి వేంకటాధిపునిసింగ.

460


సీ.

అల పురత్రయము ఘోరాజిలో వధియించు
        శూలాయుధుమహోగ్రలీల మెఱసి

  1. A.B. నెరిరెక్క గానక ముందఱికి నెచ్చి
  2. A.B. ఖాసాల
  3. A.B. దాక్కలి