పుట:వెలుగోటివారి వంశావళి.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

వెలుగోటివారి వంశావళి


అక్షీణబలుఁ డైన దక్షుని తలఁ ద్రుంచి
        నిలిచిన శరభేశు నీటు దనరి
దశకంఠలుంఠనోద్దండుఁ డైన ప్రతాప
        రామభద్రస్వామి రహి వహించి
క్రుద్ధకౌరవగదాయుద్ధమధ్యాటోప
        భీమసేనాగ్రహోద్దామలీలఁ
బెకలి యినుమాఱు తరతరాలకును జాల
గుట్టు చెడఁ గొట్టితివి గోలకొండ బలము
తమి వెలుగోటి వేంకట ధరణిధవుని
సింగధాత్రీకళత్ర యూర్జితచరిత్ర.

461


శా.

నిన్నా మొన్నటి కన్నెమన్నెదొరలన్ నీతో సమానంబుగా
నెన్నేలా గెటు లద్భుతావహము[1] లూహింపంగ నీశౌర్యశుం
భన్నానాగుణవైఖరుల్ భళి నుతింపన్ నీదిరా డాక మా
యన్నా వెల్గొటి[2] వేంకటాధిపునిసింగా సంగరాభంగురా.

462


మ.

ఒకమన్నీఁడు కరాకరిన్ దొడరి నీ హుర్మత్తు సైరించి నీఁ
గక[3] నిల్వంగలఁడా రణస్థలుల శంకాతంకమున్ లేని మ
న్నెకుమారుండవు నీవెరా రణజయోన్నిద్రా బుధాభీష్టదా
యక[4] మావెల్గొటి వేంకటాధిపునిసింగా సంగరాభంగురా.

463


శా.

ధీరోదాత్తగుణోత్తరుండ వగు నిన్ దీవింప లేనట్టి యా
నోరున్ నోరె నినుం గనుంగొనని కన్నుల్ కన్నులె నీదయా
సారం బానని యర్థి యర్థియె మహీచక్రావనప్రక్రియో
దారాంభోధర[5]ఘోరసారశరధారాసారవిస్ఫూర్జితుల్
గా రంతే వెలుగోటి వేంకటయసింగా మండలాఖండలా.

464
  1. B. హవము
  2. A.B. వెలుగోటి
  3. A.B. నేగక
  4. A.B. దాయన
  5. A.B. దారంభోధర