పుట:వెలుగోటివారి వంశావళి.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

153


ఉ.

క్రొత్తలుగాఁగ నేఁడు వెలుగోటిపురీంద్రకుమారసింగ మేల్
మొత్తము గట్టివచ్చు సిలె మూఁక వజీరులఁ గొట్టి మట్టినన్
నెత్తురు దొబ్బలున్ మెదడు వెమ్ములు ఱొమ్ముల మాంసఖండముల్
సత్తరు పెట్టిన ట్లమరు జంబుక వృద్ధపిశాచకోటిన్.

465


సీ.

పరవాహినీనాథ పటుజీవనముఁ గ్రోలు
        నీమండలాగ్రోరు[1]నీరదంబు
ద్విజురాజపోషణస్థితిఁ జెంది తనరారు
        నీబాహుసురకుంభినిగ్రహంబు
కువలయామోదంబు సవరించి విహరించు
        నీకీర్తిచంద్రికోన్నిద్రమహిమ
పద్మాస్యవిలసనప్రాభవం బొనఁగూర్చు
        నీప్రతాపద్యుమణిప్రకాశ
భళిర! భవదుదారఖ్యాతిజలధిజలధి
రాయమానరాధేయాదియరాడ్విహార
భవ్యగుణహార వేంకటప్రభుకుమార
స్థిరతరాటోప వెలుగోటి సింగభూప.

466


సీ.

తురగరింఖోద్ధూతధరణీపరాగంబు
        జాళువాపనివింత చవికె గాఁగ
నిహతారిభూధవానేకాంగ[2]బృందంబు
        విశదమౌ కల్యాణవేది గాఁగ
దళితోగ్రకరికుంభగళితముక్తావళుల్
        శ్రీల[3] నొప్పెడు తలఁబ్రాలు గాగ
[4]........................................
        ........................................

  1. B. గ్రారు
  2. A. బూధినేకాంగ B. బూధినేశాంగ
  3. B. స్త్రీల
  4. The last line is lost.