వెలుగోటివారి వంశావళి
127
తొడరి పాతాళంబు దూఱినఁ బోనీఁడు రంజిల్లు ధరణీవరాహుఁ డితఁడు[1] పరికించి యటు మిన్ను వ్రాఁకినఁ బోనీడు దట్టించు[2] మన్నెమార్తాండుఁ డితఁడు జుణిఁగి[3] యంభోరాశి జొచ్చినఁ బోనీఁడు చటులశాత్రవమీనజాలుఁ డితఁడు తలఁప నిఁక నేది విధమని పలుకుకొనుచు విఱిగి పఱతురు భవదరుల్ వివిధముగను నాహవంబున నీవు వెన్నాడినపుడు రణజయవిహారి వెలుగోటి రాయశౌరి.
పటహార్భటులచేతఁ బగతుల గుండియల్ పగిలింతు[4] కరవాలభైరవాంక శరణాగతాహితక్ష్మామండలేశుల రక్షింతు సంగడిరక్షపాల దిగ్దేశవిశ్రాంతధృతిఁ దనముఖ్యుల[5] లాలింతు సింహతలాటరాయ శేషవాల్మీకరచితవిశేషవిలాస మాలింతు[6] రాజవేశ్యాభుజంగ మన్నెమాత్రుఁడవే [నీవు] మానినీని కాయమకరాంక ఖడ్గనారాయణాంక[7] విమతసంహార వేంకటవిభుకుమార రమ్యకులదీప వెలుగోటి రాయభూప.