పుట:వెలుగోటివారి వంశావళి.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

వెలుగోటివారి వంశావళి


శా.

నీటున్ బోటు మెలంచు[1] శూరులకు గుండెల్ వ్రక్కలై తూలు నీ
ధాటీతమ్మటధంధణంధణల నుద్భాసించు నీతో నిరా
ఘాటాహంకృతిఁ[2] బోర నొక్కనికి శక్యంబా రణాభీలబా
హాటోపాధిప వేంకటప్రభునిరాయా వీరకంఠీరవా.

377


*సీ.

అతిగాఢపరిరంభణాసక్తిఁ గదిసినఁ
        గౌఁగిటి కెద[3]యీఁడు కమఠభర్త
గోరి చుంబించఁ బైకొన[4] మోవిపైఁ గేలు
        దిగువఁ[5]జాలకయుండు దిగ్గజములు
మనసు రంజిల్ల పాదపద్మంబు
        లొత్తఁ జూడంగనీఁ డురగవిభుఁడు[6]
పలుకుసందడిఁ బల్కుఁ బల్కించుకొన నోడు
        సరసనర్మోక్తుల శైలరాజు
సమరసులుగాని యీమూఢతములపాలఁ
బడఁగ నేమిటి కని ధరాప్రౌఢకాంత
వలచి వచ్చిన బహుకళావైభవములఁ
బ్రౌఢిఁ బాలించు రాయభూపాలమాళి.

378


క.

హితమతి నారాయమహీ
పతిరత్నము రాగమాంబఁ బరిణయ మయ్యెన్
రతిదేవిఁ బంచబాణుఁడు
నతులశ్రీలక్ష్మి నంబుజాక్షుఁడు వోలెన్.

379
  1. A.B. బోటమెలించు
  2. A.B. నుద్యశ్మించు నీతోనిరాఘాటాలంకృతి
  3. A.B. కెడ
  4. A.B. చుంబించు బైకొని
  5. A.B. తెగువ
  6. A.B. రంగవిభుడు