పుట:వెలుగోటివారి వంశావళి.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

129


సీ.

అంబుజంబు ధరించు నల కైటభారాతి
        యంబుజంబును మెట్టునబ్ధికన్య[1]
శమదమాదులఁ జూడ నమరు శంకరయోగి
        చండికాహ్వయ మందు శైలతనయ
సిద్ధసత్త్వమున రాజిలుఁ గూర్మకులమౌళి
        రాజసం బూను ధరాపురంధ్రి
వేల్పుఁ బుట్టువుఁ దాల్చి వెలయు నద్రివిభేది
        యసురజన్మముఁ గాంచు హరివధూటి
అరయ నిటువంటి సహధర్మచరులు గలిగి
రౌర యని రాయభూపనాయకహితైక
ధర్మశీలానుకూలవర్తనల మెఱయు
రమ్యవిలసత్కృపాలంబ రాగమాంబ.

380


*క.

ఆరాగమాంబవలనఁ గు
మారమణులఁ గనియె రాయమనుజేంద్రవిభుం
డారూఢకీర్తి రంగ
క్ష్మారమణుఁ గుమారరంగమహిపతిచంద్రున్.

381


*వ.

అందగ్రజుండు.

382


*సీ.

ఖ్యాతిప్రతాపాబ్ధిగరిమచే నెఱిఁగించు
        నుభయకావేరిమహోర్మిహేల[2]
నానాప్రకారసేనాజాలములఁ దెల్పు[3]
        సప్తావరణ[4]చక్రసహితలీల
శరణాగతారాతిసరణిచేఁ బ్రకటించు
        ధర విభీషణసేవితక్రమంబు
ధీరవైష్ణపసమృద్ధినిఁ జాల వెలయించు
        నిత్యసూరికదంబ నియమవృత్తి

  1. A.B. మెట్టునట్టికన్య
  2. A. మహేర్విఖేల B. మహాద్విబేల
  3. A.B. దెల్చు
  4. A.B. సప్తారణి