పుట:వెలుగోటివారి వంశావళి.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

వెలుగోటివారి వంశావళి


బహుళనృపదత్త[1]మహితసంపదలఁ జూపు
నందపద్మమకరముఖ[2]నవనిధులను
రమ్యపరిమళకస్తూరిరంగఁ డైన
రాయభూపతిరంగభూనాయకుండు.

383


*క.

హరిబలుఁడగు నతనిసహో
దరుఁడైన కుమారరంగధాత్రీశ్వరుఁ డు
ర్వరఁగీర్తిన్[3] గని మించున్
వరహరిపదభక్తివైభవధ్రువుఁ డనఁగన్.

384


క.

[4]ఆచతురున కనుజన్ముఁడు
ధీచాతుర్యాతివిభవ[5]దేవగురుండై
భూచరఖేచరు లెంచఁగ
నేచక్షితినాథచంద్రుఁ డేలు ధరిత్రిన్.

385


వ.

ఆయేచమనేని వంశావతారం బెట్టి దనిన.

386


క.

అలయేచఘనునిపుత్రులు
విలసిలుఁ గస్తూరిరంగ వీరాగ్రణియున్
బలయుతుఁడు తిమ్మవిభుఁడును[6]
హలపాణియు శార్ఙ్గధరుఁడు నన మించి[7] రిలన్.

387


ఉ.

ఈశసదృక్షభూతినిధి యేచయరంగవిభుండు బాహుఖ
డ్గాశని గోలకొండ యవనాచలపంక్తినిఁ గూల్చు[8] నార్పు గ
ర్జాశతమై వినంబడఁగఁ జండనిశాచరహంత[9] క్రొత్తలం
కాశివసాక్షిగా ముగురుగంగలుసాక్షిగఁ గోటసాక్షిగన్.

388
  1. A.B. దంత
  2. A.B. నలహరిశ్చంద్రముఖనిత
    నవవిధులలో నందస్థానమున ‘కుంద' అని కొందఱు, నందపాఠమే సుప్రసిద్ధము.
  3. A.B. కీర్తుల
  4. This stanza comes after 336 in the Mss.
  5. A.B. చాతుర్యాభివిజిత
  6. A.B. వెలశిరి రంగక్షితిపతివీరప్రతాప | బలశౌర్యుండు తిమ్మవిభుండు |
  7. A.B. హలపాణీశార్ఙ్గధరులనంగా
  8. A.B. గెల్చ
  9. A.B. హంతి