పుట:వెలుగోటివారి వంశావళి.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

127


తొడరి పాతాళంబు దూఱినఁ బోనీఁడు
        రంజిల్లు ధరణీవరాహుఁ డితఁడు[1]
పరికించి యటు మిన్ను వ్రాఁకినఁ బోనీడు
        దట్టించు[2] మన్నెమార్తాండుఁ డితఁడు
జుణిఁగి[3] యంభోరాశి జొచ్చినఁ బోనీఁడు
        చటులశాత్రవమీనజాలుఁ డితఁడు
తలఁప నిఁక నేది విధమని పలుకుకొనుచు
విఱిగి పఱతురు భవదరుల్ వివిధముగను
నాహవంబున నీవు వెన్నాడినపుడు
రణజయవిహారి వెలుగోటి రాయశౌరి.

375


సీ.

పటహార్భటులచేతఁ బగతుల గుండియల్
        పగిలింతు[4] కరవాలభైరవాంక
శరణాగతాహితక్ష్మామండలేశుల
        రక్షింతు సంగడిరక్షపాల
దిగ్దేశవిశ్రాంతధృతిఁ దనముఖ్యుల[5]
        లాలింతు సింహతలాటరాయ
శేషవాల్మీకరచితవిశేషవిలాస
        మాలింతు[6] రాజవేశ్యాభుజంగ
మన్నెమాత్రుఁడవే [నీవు] మానినీని
కాయమకరాంక ఖడ్గనారాయణాంక[7]
విమతసంహార వేంకటవిభుకుమార
రమ్యకులదీప వెలుగోటి రాయభూప.

376
  1. A. రవళిసింహతలాటరాయడితఁడు
  2. A.B. ధట్టించు
  3. A. జాగిగి
  4. A.B. గవించు
  5. A.B. దృతన (ధృతన) ముఖ్యాలీల
  6. A. శేష వాల్మీకాది చిద్విశేషవిలాలచతురోక్తి
    B. శేష వాల్మీకాదిబిత | విశేషవిలాసచరురోక్తి
  7. A. మన్యమాత్రుండె &c. B. కన్యమాత్రుండె మానినీనికాయమానమకరాంక ఖడ్గనారాయణాంక