పుట:వెలుగోటివారి వంశావళి.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

వెలుగోటివారి వంశావళి


యొరయు రాహత్తుల నుఱికి పోనీయక
        యరికట్టి[1] నఱకు నీకఱకుహేతి
పోతరించిన వైరిభూతలేంద్రులమీఁదఁ
        బాతరల్ సలుపు నీబలుకటారి
కంటకద్వేషుల కంఠరక్తముఁ గ్రోలి
        మించి గోరించు నీమెఱుఁగుటీఁటె
నీకు నెదురేరి లోభిమన్నీలమిండ
గాయగోవాళ బల్లరగండబిరుద
పౌరుషోదార వేంకటప్రభుకుమార
నాయకోపేంద్ర వెలుగోటి రాయవేంద్ర.

373


సీ.

మహిప[2] హెచ్చరిక దుస్సహసింహళద్వీప
        సంబంధమదభద్రసామజములు
స్వామీ పరాకు జంఝామారుతారూఢ
        గాంధారభవమహాసైంధవములు[3]
చిత్తైసు[4] నాథ రంజితమేఘనిర్ఘోష
        భీకరారావంబు భేరికులము[5]
అవధారు ధీర[6] చిత్రాభ్రంకషస్వర్ణ
        ధళధళద్యుతిరాజితధ్వజములు
సాళ్వబిరుదాంకముఖ్యరాజాళిఁ[7] గొట్టి
తెచ్చినవటంచు[8] గంచుకుల్ హెచ్చి తెలుపఁ
గనుఁగొనుచు నిండుకొలువుండు ననుదినంబు
రణజయవిహారి వెలుగోటి రాయశౌరి.

374


సీ.

ఎటువంటి గుహలలో నీఁగినఁ బోనీఁడు
        రవళి సింహతలాటరాయఁ డితఁడు

  1. A.B. అరికల్మి
  2. A.B. మహిప
  3. The second line of the verse is omitted in A.
    The third and fourth lines are transposed in B.
  4. A.B. చిత్తేశు
  5. A. భేదికులంబు
  6. A.B. ధీరు
  7. A.B. రాజేశులను
  8. A.B. తెచ్చినవని