పుట:వెలుగోటివారి వంశావళి.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

125


*మ.

మకరీతోరణపంక్తి మీఱ నవరంభాలీల రంజిల్లఁగా[1]
వికసత్కీర్తిపయోధిఁ బుట్టి ధరణీవిఖ్యాతయౌ చెన్నమాం
బిక య న్కల్మిచెలి న్వరించె[2] విబుధుల్ మెచ్చన్ సుధాబిందుమౌ
క్తికపుం బ్రా లలరంగ[3] వేంకటధరాధీశుండు హర్షంబునన్.

368


ఉ.

రాయపనేని వేంకటధరాధిపుచే ననిఁ ద్రెవ్వి మింటికై
పోయిన వైరి నెంత వలపో నిలుపోపక[4] చూచుఁ జూచి ర
మ్మా యని చీరుఁ[5] జేరి నిలయంబునకుం గొనిపోవుఁ బోయి పు
ష్పాయుధు కేళిఁ దేల్చు నవురా యలరంభ విజృంభితాంగియై[6].

369


వ.

అతని కుమారుండు.

370


*క.

వెలుగోటి వేంకటేంద్రున
కలఘుగుణాలంబ చెన్నమాంబామణికిన్
గలిగెను రాయమహీంద్రుఁడు
వలరాయఁడు హరికిఁ బద్మవాసినికి వలెన్.

371


*మ.

అధికారాతిమహీధురంధరమహాహంకారనిర్భేదన
ప్రధనోగ్రుండగు వేంకటేంద్రసుతుఁ డౌ[7] రాయక్షమాభృత్కళా
నిధిచంద్రున్ నగు కీర్తి గైకొని బుధానీకంబు మైత్రిన్ ధరిం
పు ధరిత్రిన్ సతతంబుఁ జూచు సుజనంబుల్ మ్రొక్కి కీర్తింపఁగన్.

372


సీ.

మెండొడ్డుమన్నీల దండుబారుల కెక్కి
        గగ్గోలు పఱచు నీగబ్బితేజి

  1. The reading adopted is that of B.P.
    A. మీరనపరమ్భాళిల రంజిల్లగా
    B. మీరిన పరమ్భాళిలరంజిల్లగ
  2. A.B. వరించ
  3. A.B. బాలలరంగ
  4. A.B. నిలుపోపజూచు
  5. A.B. మమ్మాయని చేరు చేరినిలుచుంబనకుం
  6. A.B. విజృంభితాహిలన్
  7. A.B. సుతుడా