పుట:వెలుగోటివారి వంశావళి.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

వెలుగోటివారి వంశావళి


సీ.

ఉదుటుమన్నెకుమార మదగర్వభంజన
        గొంటు[1]మన్నెకుమార కంటినెరస
విరసమన్నెకుమార విపినదావానల
        శత్రుమన్నెకుమార శరభమూర్తి
కంటుమన్నెకుమార కాలాగ్నిరుద్రుండ
        వెగటుమన్నెకుమార వెన్ను తఱట
[2].............................................
        .............................................
కక్కసపుమన్నెమూఁకల ముక్కుగొయ్య[3]
కూటువలు గూడుమన్నీల గుండెదిగులు
వనధిగంభీర రాయభూవరకుమార
విక్రమోపేంద్ర వెలుగోటి వేంకటేంద్ర.

366


*సీ.

కలిమి యేమి ఘటించుఁ గమరేంద్రుఁ గూడిన
        రమణికి నుదకపారణమె[4] కాక
యేవిశేషము గల్గు నిభరాజుల వరించు
        కాంతకుఁ బర్ణభక్షణమె కాక
పుణ్య మేమి ఫలించు[5] భుజగవల్లభుఁ గోరు
        వనితకు ననిలభోజనమె కాక
యేఫలం బొదవుఁ గిటీశు నందిన యంగ
        నకును ముస్తాచర్వణంబె[6] కాక
అనుచు వారల నిరసించి యవనికాంత
సిరుల రంజిల్లు రాయభూవరకుమార
వేంకటాధిప లోకమృగాంకుఁ గూడి
యనవరతభోగభాగ్యంబు లనుభవించు.

367
  1. A.B. కంటి
  2. The third line of the verse is missing in both the Mss.
  3. A. ముగొయ్య B. ముకుగొయ్య
  4. A.B. వారణమె
  5. A.B. ఘటించు
  6. A.B. ముక్తాచర్వణంబె