పుట:వెలుగోటివారి వంశావళి.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

123


సర్వబిరుదర రాయవేశ్యాభుజంగ
విక్రమాపేంద్ర వెలుగోటి వేంకటేంద్ర.

363


సీ.

వ్రాలుఁ బెట్టనికమ్మ వ్రాలనర్గళముగా[1]
        నడుప నేసింహాసనస్థుఁ డోపు
నెట్టికార్యం బైనఁ బట్టినఁ జలపట్టి
        తుద నిర్వహింప నేదొర తనర్చు[2]
విగడియ నూఱాఱువేలు గూర్పను వివ్వ[3]
        ఘనతమై నేనృపాలునకుఁ జెల్లు
సురథాణి గజపతి నరపతు లాశింత్రు
        బలిమి కేమన్నీని ప్రాపుదాపు
అతఁడు మన్నీనిమాత్రుఁడే ప్రతినృపాల
వర్గసంహారసమరోగ్రభార్గవుండు
సౌర్వభౌముండు వెలుగోటిశాసనుండు
రాయవిభువేంకటాద్రిభూనాయకుండు.

364


సీ.

దర్పితంబైన నీతమ్మటధ్వని విన్న
        గడిమన్నెమూఁకలు కలఁగిపాఱు
భీకరంబైన నీబిరుదుటెక్కెముఁ గన్న
        రిపురాజుసేనలు ఱిచ్చవడును
బిత్తరంబైన నీయుత్తమాశ్వముఁ గన్న
        బ్రతికక్షనివహముల్ భగ్నమగును
బల్లిదంబగు నీదు బాహాసిఁ బొడఁగన్న
        ఘోరవిరోధుల గుండె లవియుఁ
జెలఁగి నీధాటిఁ బుట్టిన చిత్రగతుల
వైరిదుర్గము ల్గజగజ వణఁకుచుండు
వనధిగంభీర రాయభూవరకుమార
విక్రమోవేంద్ర వెలుగోటి వేంకటేంద్ర.

365
  1. A. వాలుపర్గంబుగా; B. వ్రాలుపర్గంబుగా
  2. A.B. తరంబు
  3. A. విఘడియలోన నూరారుగూర్పనువిచ్చను