పుట:వెలుగోటివారి వంశావళి.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

వెలుగోటివారి వంశావళి


తనసేన కొంచె మాతలి సేన[1] ఘనమని
        వీఁగఁ జూచెడువాని వెన్ను తఱటు
తారసించిన చోటఁ దానెక్కి పొడువక
        బంటుఁజూపెడువాని కంటుమగఁడు
అరిరాజకరిఘట లల్లంత నెదిరిన
        నిలువని మన్నీల నెత్తిపిడుగు
అనుచుఁ గొనియాడుదురు నిన్ను నర్థివరులు
కుకురుకొంకణటెంకణఘూర్జసభల[2]
వనధిగంభీర రాయభూవరకుమార
విక్రమోపేంద్ర వెలుగోటివేంకటేంద్ర.

360


సీ.

ప్రాణదానము సేయు ప్రతిగండభైరవ
        యభయ మీ ఖడ్గనారాయణాంక
నేరమెంచకుము హిందూ[3]రాయసురతాణ
        దయఁ జూడు రిపుగజదళవిభాళ
కాపాడుమీ యన్మగంటిపురాధీశ[4]
        కరుణింపు[5] బల్లరగండబిరుద
రక్షింపు[6] కాకితరాజ్యసంస్థాపక[7]
        బ్రదికింపు శశికుల పరశురామ[8]
యనుచు మ్రొక్కెద రెపుడు నీయరినృపాలు[9]
రాజికిని నోడి నీపదాంభోజములకు

  1. A.B. మావలిసేన
  2. A. కుకురుకొంకణ ఘూర్జరాజ్యసభల; B. కుకురుకొంకణటెంకణ ఖూర్జరాజన్యసభల
  3. A. నేరంబు లెంచకిందూరాయసురతాణ
  4. A. కాపాడుమనుమగంటి పురవరాధీశ్వర
  5. A. కరుణించు
  6. A. రక్షించు
  7. A. కాకితరాయరాజ్య స్థాపనాచార్య
  8. A. సోమకుల పరశురామ
  9. A. నీవైరిరాజు