పుట:వెలుగోటివారి వంశావళి.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

121


కులనగధీరుఁ బ్రతాపో
జ్జ్వలు వేంకటనృపు యశోవివర్ధనుఁ గాంచెన్.

359


*శా.

ఆరాయక్షితినాథమాళికి విపక్షాద్రీంద్రదంభోళికిన్[1]
ధీరోదాత్తునకున్ జనించి[2] గరుడాద్రిస్వామి విస్తీర్ణతే
జోరాశి ప్రకటీకృతాంశుఁ డన మించున్[3] వేంకటాద్రీశ్వరుం
డారత్నాకరకుంభినీవలయరక్షారూఢకారుణ్యుఁడై.

360


*సీ.

శేషాచలేంద్రవిశేషధామంబున
        నెలకొన్న విఖ్యాతి నెఱపువాఁడు
బాలార్కరుచి గన్న పద్మరాగంబునఁ
        గనుపట్టు నఱచేయి గలుగు[4]వాఁడు
లలితహారంబులు యలమేలు జిగిఁ గూడి
        తళుకుమీఱిన యురస్థలమువాఁడు
విబుధకంటకరాజిఁ గబళించు చాయల
        డాఁకొన్న పసిఁడి కటారివాఁడు
ధరణిదేవతలను బ్రసాదములఁ దనిపి
సంతతానంద[మును] గూర్పఁ జాలువాఁడు
వేంకటస్వామిగతి రాయవిభుకుమార
వేంకటస్వామి దిక్కుల వెలయుచుండు.

361


సీ.

పౌజు[5]లల్లంతనె పరిపాటిగాఁ జూచి
        యుండ కేఁగెడువాని గుండెదిగులు

  1. B.P. మంధాద్రికిన్
  2. A.B. జనించు
  3. A.B. ప్రకటీకృతాంశుఁడు జనించున్
  4. A.B. నరచాతిగలుగువాఁడు
  5. A.B. పంజులు