పుట:వెలుగోటివారి వంశావళి.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

వెలుగోటివారి వంశావళి


శా.

బీటల్ వాఱెను దిక్తటంబు నగముల్ బెట్టూగె నంభోనిధుల్
తేటం బాసెను నీటఁ జండరవిదీప్తిన్[1] మాసెఁ బో నీ డమా
మీటోకించిన శాత్రవుల్ చెదర కేమీ నిల్తురే యాజి వె
ల్గోటీచెన్ననృపాలువేంకటపతీ లోకైకరమ్యాకృతీ.

355


శా.

ఆంధీభూతము లౌ దిగంతరము ల ద్యజంజంతుసంఘంబుతోఁ
గంధుల్ ఘూర్ణిలు గొండ లుర్విఁ బడు దిగ్దంతుల్ వెసం గ్రుంగు నీ
ధంధంధాణఢమామికార్భటికి నై దర్బారిదంభాటవీ[2]
గంధేభా వెలుగోటివేంకటపతిక్ష్మానాథకంఠీరవా.

356


సీ.

అనిలోన గెల్చి తెచ్చిన గజంబుల[3] గాని
        సజ్జారములఁ గట్టి సాకఁబోఁడు
బిరుదుమన్నెకుమాళ్ల బింబాధరలఁ[4] గాని
        చెఱలఁ బట్టించఁ డుద్ధురత మెఱసి
గడివిరోధుల మాంసఖండంబులే కాని
        భుక్తిసేయఁడు ఖడ్గభూతమునకు
సాహసోద్భటవీరరాహుత్తులనె కాని
        పాటింపఁ[5] డితరభూపతుల సరణి
అతఁడు సంగరగాంగేయవితతశౌర్య
గాయగోవాళఖడ్గనారాయణాది
బిరుద వెలుగోటి[6]చెన్నభూవరసుతుండు
ప్రథనవిజయుండు వేంకటపతిఘనుండు.

357


వ.

ఆరాయప్పనేని వంశావతారం బెట్టి దనిన.

358


క.

వెలుగోటిరాయనరపతి
కలితమునన్[7] లింగమాంబికం బరిణయమై

  1. A.B. జంధిరవిదీప్తుల్
  2. A.B. దంభావనీ
  3. A.B. గజంబులనె
  4. A.B. బింబాధరలె
  5. A.B. పాలింప
  6. A.B. బిరుదువెలయు వెలుగోటిచెన్న
  7. A.B. కలికమునలింగ