పుట:వెలుగోటివారి వంశావళి.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

119


దరి నెక్కఁ దనహేతి తతవైరిరాజన్య
        మకుటాగ్రములు వకావకలు సేయ
మఱి మీఱి తనధాటి మహనీయబిరుదాంక
        ములు వారిధుల బెళాబెళలు సేయ
మించె నిదె గాయగోవాళ పంచపాండ్య
దళవిభాళాదిజాగ్రదుదగ్రబిరుద[1]
పాళి వెలుగోటిచెన్నప్రభుకుమార
హేళి వేంకటపతి[2]మహీపాలమాళి.

353


సీ.

సర్వజ్ఞసింగభూజాని సద్గుణవార్ధి
        యాలవాలంబుగా నంకురించె[3]
నిర్వాణరాయమహోర్వీరమణశౌరి
        నవకృపావృష్టి చే[4] ననలుసూపె
గనితిమ్మధారుణీజననాథమూర్ధన్య
        జిష్ణువైభవమునఁ[5] జెట్టుగట్టె
మీతండ్రి చెన్నపమేదినీశ్వరు[6] భుజా
        శక్తిచే శాఖోపశాఖ లయ్యె
వేఁడు భవదీయసద్గుణానీకగరిమఁ[7]
బూచి కాచి ఫలించె సంపూర్ణకీర్తి
పండఁబాఱిన వెల్గోటివంశశాఖ[8]
ప్రకటితాటోప వేంకటపతిమహీప.

354
  1. A. జాగ్రదుదగ్ర; B. జాదుదశ్రీ
  2. A.B. వెంకటమహీ
  3. A.B. నంకురించి
  4. A.B. నవకృపాదృష్టిచే
  5. A. మూర్ధన్యముజిష్ణు వైభవమున; B. మూర్ధన్య...ష్ణు వైభవమున
  6. A.B. చెన్నపృథ్వీశ్వరు
  7. A.B. నీపగరిను
  8. A.B. పాటవారుని శాఖవెల్గోటివారు