పుట:వెలుగోటివారి వంశావళి.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

వెలుగోటివారి వంశావళి


నట్టిరాహుత్త[1]సంతతత్యాగభోగ
భాగ్యశాలి పదానతపరనృపాల
పాళి[2] వెలుగోటి చెన్నమ[3]ప్రభుకుమార
హేళి[4] వేంకటపతిమహీపాలమాళి.

351


సీ.

ఒకపాటికుట్ర[5] మన్నెగుమాళ్లు[6] నూఱార్లు
        గూడినఁ గన్నెత్తి చూడఁ గలరె
యటుగాక రాయలంతటి వజీరులు వేవు
        రైనను నీవాటు కాఁగఁ గలరె
డాక నెంతటి[7] కిరీటముల రాజులు లక్ష
        చేరిన నెదురాని పోరఁ గలరె
మఱి పాదుశాహులె మెఱసి కోట్లకొలంది
        నిలచి పోరిన మీఱి గెలువఁ గలరె
బలయు నీ దుముదారుపంపులకు నలుకు
దురు మరుత్పతులైనను దుది నిజంబు[8]
వి్న్నవించెద వెలుగోటిచెన్నభూమి
పాలకుని వేంకటపతీంద్ర భాగ్యసాంద్ర.

352


సీ.

మునుమున్నె తనఢమాధ్వని[9] విరోధినృసాల
        కుల దుర్గములు పెళాపెళలు[10] సేయ
నటుచేరఁ దనతేజి పటుహేష లరిభూభు
        జుల గుండియలు గులాగులలు సేయఁ

  1. A.B. అట్టిరానింత
  2. A.B. పాలి
  3. A.B. చెన్న
  4. 6 A.B. హేలి
  5. A. కుటృ; B. కట్ట
  6. A.B. కుమార్లు
  7. A.B. నంతటి
  8. A.B. యిది నిజంబు
  9. A.B. ఢమామీధ్వని
  10. A.B. పెఠాపెఠలు