పుట:వెలుగోటివారి వంశావళి.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

117


సీ.

రాజులలోఁ దిమ్మరాజుదే ధైర్యంబు
        మన్నీలలో నీదె మగతనంబు
పెనుగొండనుండి వచ్చిన దాడి[1] తెగువకు
        గట్టైన బద్దలు[2] గాకపోనె
దొడ్డ కొంచెముఁ జూచు దొరల గండఁడు[3] వాఁడు
        ప్రతిగండభైరవ ప్రతిభ నీది
ఎలగోలు చిల్లరబలము లానవు[4] వాని
        పూని నీకై జీత మానె నౌర
వేడ్క నినుఁ జేరె సంగ్రామవిజయలక్ష్మి
రంభ కౌఁగిలి జేరె నారాజవరుఁడు
భళిర! వెలుగోటిచెన్నభూపాలపుత్ర
భవ్యగుణశీల వేంకటపతినృపాల.

350


సీ.

కెరలెనా బారుల కుఱికి యెంతటి దునే
        దారి నైనను జెండి పాఱవైచు
నిచ్చెనా కోర్కెల నిచ్చి తండోపతం
        డములుగా నర్థిసంతతులఁ బ్రోచుఁ
జేరెనా హొయలు మిటారికత్తెలకు సా
        క్షాన్మన్మథునివలెఁ గానుపించు
నవ్వెనా నిండుపున్నమపండువెన్నెలల్[5]
        చల్లి కొల్వెల్ల[6] రంజిల్లఁ జేయు

  1. A. దాని; B. దాగి
  2. A. గట్టైబద్దలుగాక; B. గట్టైబధలుగాక
  3. A. గంన్నడు; B. గున్నడు
  4. B. లావు
  5. A.B. వెన్నెలలు జల్లి
  6. A.B. కొలువెల్ల