పుట:వెలుగోటివారి వంశావళి.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

వెలుగోటివారి వంశావళి


థితరణస్థేమభోగైకకవితరణముల
జిష్ణుతాటోప వెలుగోటిచెన్నభూప.

344


మ.

అతని కుమారులు.

345


చ.

అనుపమలీలఁ గొండవసుధావరు[1] చెన్నని వేంకటాద్రి పా
వనగుణశీలుఁడై యుభయవంశపవిత్రకుఁడై బలాఢ్యుఁడై
ఘనుఁడయి కీర్తిమంతుఁడయి గర్వితవైరివిభాళుఁడై జగ
జ్జనవరపూజ్యుఁడై నిజభుజాసముపార్జితరాజ్యుఁడై మనున్.

346


వ.

అతనియనుజుండు.

347


సీ.

సకలవిద్యల భోజుసాటికి[2] వచ్చు స
        ర్వజ్ఞసింగక్షమారమణుఁ డొకఁడు
బిరుదుమన్నీలపై నుఱిమి మ్రొక్కులు గొను
        గనితిమ్మధారుణీకాంతుఁ డొకఁడు
శూరులు మెచ్చ నూఱాఱుగెల్పులు గెల్చి
        మీఱు కస్తురిరంగశౌరి యొకఁడు
సింహాసనస్థులచేఁ బూజఁ గాంచు మీ
        తండ్రి చెన్నప్రభూత్తంసుఁ డొకఁడు
అందఱను మించి పద్మనాయఁకకులంబు
వెలయఁజేసిన మరువంపుమొలక వౌర
బుధజనాధార వెలుగోటిపురవిహార
యతులగుణజాల వేంకటపతినృపాల.

348


మ.

భళిరా! యప్రతిమానదానగుణశుంభన్మానుషఖ్యాతులన్
గలరా నీసరి రాయమన్నెదొర లీగకర్ణాటకక్షోణిలో
నలనాసత్యశుభాకృతీ విదళితోన్మత్తారిధాత్రీపతీ
వెలుగోటీపురధామవేంకటపతీ విద్వన్నుతోద్యన్మతీ.

349
  1. B. వసుధామర
  2. A.B. భోజునికిసాటికి