పుట:వెలుగోటివారి వంశావళి.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

115


ఘోటఘోటీనిరాఘాటధాటీసము[1]
        త్పాటితక్షోణి నీప్రబలధాటి
భీమభీమాలికాక్షామధూమధ్వజ
        స్థేమధామంబు[2] నీతేజ మహహ
ప్రస్తుతింపంగఁ దరమె దుర్భరవిరోధి
కంఠరక్తావగాహెగ్రఖడ్గజనిత
విజయరేఖాధరీభూత[3]విక్రమార్క
వీర్య[4]సంపన్న పెదకొండవిభునిచెన్న.

342


ఉ.

బల్లిదమైన బెబ్బులికి బాఱుమృగంబులరీతిఁ గాక యీ
చిల్లర మన్నెమూఁకలు విజృంభణవృత్తికి నానఁ బూనునా
బల్లరగండమూర్తి రణభార్గవరాముఁడు కొండధారుణీ
వల్లభుచెన్నుఁ డాజి కిదె వచ్చెననన్ బరువెత్తు మృత్యువున్.

343


సీ.

తారాధిపతియును దారాధిపతియును
        దారాధిపతియు నీతరమువారు[5]
కమలాధిపతియును గమలాధిపతియును
        గమలాధిపతియు నీకరణివారు
పద్మాధిపతియును బద్మాధిపతియును
        బద్మాధిపతియు నీపగిదివారు[6]
ఖచరాధిపతియును ఖచరాధిపతియును
        ఖచరాధిపతియు నీకడిమివారు[7]
శేముషీ సత్కళాజ్ఞానవిశేషమాప్ర
తాపనైర్మల్యవాగ్ధనుర్నైపుణీప్ర

  1. A.B. ధాటీకనో
  2. A.B. దామంబు
  3. A.B. రేఖాదరీభూత
  4. A.B. వీర
  5. A. తరమువాడు; B. కరణివాడు
  6. A. పగిడివాడు; B. నీకరణివాడు
  7. A.B. కరణివాడు