వెలుగోటివారి వంశావళి
109
దవులతాబాదు[1] గందపుకాకితంబునఁ[2] బలుమారునద్దినఁ[3] బాసిపడదు మధురసాస్వాదమదఘూర్ణమానయవన పరివృఢా[4]పేక్షణాళ్లిష్టపవనజవన తిరుపతినృపాలుతిమ్మభూవర త్వదీయ ధాటికాఘోటకఖురోత్థ[5]ధరణిధూళి.
నీచిరదానవారితటినీపతి నాని పయోధి మించుఁ ద త్సేచన[6]వర్ధమానతృణసేవ సమస్తము నిచ్చు దేవతా నైచికి తత్కరీషభజన న్మఱి[7]కల్పక మిచ్చు సర్వదా త్రాచరణంబు నీవలన నైనది[8] తిమ్మనృపాలశేఖరా.
దేవమహీజ మందె నొకదిక్కున మంజరి[9] చంద్రుఁ డందెఁ దా రావళి వార్షికాంబు[10]ధర మందె నుదాహరణంబు నీతసం భావన మింటివార్త లవి మన్నన నీవలె నెవ్వరంది రెం తే వసుధాస్థలిన్ దిరుపతిప్రభుతిమ్మ మహాప్రబంధముల్.
శ్రీరామపాదరాజీవయుగ్మమరంద రసమి[11]ళన్మత్తసారంగ రంగ పరవరూధిన్యుత్థపటహదంధణవిస్ఫు రద్రావనృత్యత్తురంగ రంగ