పుట:వెలుగోటివారి వంశావళి.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

వెలుగోటివారి వంశావళి


రిపువపుర్విగళితాశ్రితజయశ్రీపరి
        రంభశుభద్రణరంగ రంగ
కీర్తినిర్జితకార్తిచంద్రభవమహీ
        ధ్రపటీరగంగాతరంగ రంగ
సకలసుకవీంద్రగాయకసరసవిబుధ
రక్షదక్షిణవిమలాంత[1]రంగ రంగ
తరుణలావణ్యవిజితకందర్పదర్ప
నిరతశోభాంగ తిరుపతినేనిరంగ.

323


సీ.

వినవచ్చె నది వీరవేశ్యాభుజంగుని
        జయభేరికాస్ఫురచ్ఛంఖరవము
కన్పట్టె నల్లదె గాయగోవాళుని
        ధవళాతపత్రకేతనచయంబు
చనుదెంచె నదె రాయచౌహత్తమల్లుని
        గజతురంగానేకఘనబలంబు
మార్కొనె నదె మీఱి మన్నెహంవీరుండు
        గాండివివైఖరిఁ గదనమునను
ననుచు నీధాటికిని నోడి యహితు లెల్లఁ
గాన కేఁగిరి నిను నాజిఁ బూనలేక
నూనశరగాత్ర తిరుపతినేనిపుత్ర
సంగరాటోప వెలుగోటిరంగభూప.

324


సీ.

గర్వదుర్వారభీకరశత్రునాయక
        భూధరంబులకు దంభోళిధార
శుంభద్భుజారంభదంభశాత్రవరాజ
        కుంభీంద్రహర్యక్షడింభకంబు
కుటిలప్రచారవిస్ఫుటవైరిభూపాల
        జలధరోద్ధూతజంఝానిలంబు
సంగరపాటవోత్తుంగారిభూనాథ
        పాథోధిజిద్బడబాగ్నికీల

  1. A. రక్షణ రక్ష విమలాంత; B. రక్షణక్షణవిమలోత్త