పుట:వెలుగోటివారి వంశావళి.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

111


నీకరాబ్జాత సంభూతనిబిడహేతి
యౌర! యుద్దండవృత్తివీరాగ్రగణ్య
భళిర! వెలుగోటితిరుపతిప్రభుకుమార
రంగధీర మహూగ్రశాత్రవవిదార.

325


చ.

దురమున వైరిరాజులను దోర్బలశ క్తిని ఖడ్గధారచేఁ
గరకరి గాఁగఁ జంపుదు వఖండితవిక్రమ! రాముకైవడిన్
గురుతరకీర్తిహార వెలుగోటిధురంధర మేలుమేలురా
తిరుపతినేనిరంగ సుదతీనవమోహనపంచసాయకా.

326


సీ.

మత్తారిభూపాలమస్తకంబులె కాని
        ఖండించ దౌర నీఘనకరాసి[1]
వైరిధాత్రీనాథవక్షంబులే గాని
        వరుస మెట్టదు నీదు వరహయంబు
విరసావనీంద్రులవెన్నుపైనే కాని
        తాకదు నీచేతి తఱటుపెట్టు
గర్వితాహితరాజగాత్రంబులే కాని
        కాలరాయదు[2] నీదు గంధగజము
శత్రుమదభంగ రాజవేశ్యాభుజంగ
దండితారాతి బల్లరగండబిరుద
ప్రకటచారిత్ర తిరుపతిప్రభుసుపుత్ర
కీర్తివిస్తార వెలుగోటికృష్ణధీర.

327


సీ.

మత్తవిద్విషబాహుమధ్యవీథులఁగాని
        వేడెంబు లీడదు నీ విజయతురగి
కిల్బిషాహితగర్భకీలాలములఁగాని
        పానంబు గొనదు నీ భద్రకరటి[3]

  1. A.B. కరాళి
  2. A.B. ఖండించదౌర
  3. A.B. కరము