పుట:వెలుగోటివారి వంశావళి.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

వెలుగోటివారి వంశావళి


గంధాంధ[1]శాత్రవకంధరంబులఁగాని
        చేరదు యొఱకు నీచేకఠారి
ప్రతిభటోద్భటవీరభటకోటిపైఁగాని
        కదియగు నీసముత్కటభటాళి
భళిర! ప్రతిగండ భైరవపంచపాండ్య
దళవిభాళమహాబిరుదప్రసిద్ధ
విజయవెలుగోటి తిరుపతివిభు[2]కుమార
విమలచారిత్ర కృష్ణపృధ్వీకళత్ర.

328


వ.

ఆపెదకొండప్పనేని వంశావతారం బెట్టి దనిన.

329


క.

ఘనుఁడు పెదకొండభూపతి
ఘనకైశిక యల్లమాంబికం బరిణయమై
కనియెఁ బెదతిమ్మవిభుఁ జె
న్ననరేశుని వేంకటాద్రినాథవతంసున్[3].

330


వ.

అందగ్రజుండు.

331


ఉ.

ధే యని పెద్దకొండజగతీవరు తిమ్మనృపాలుఁ డాగ్రహ
ప్రాయమనీషి నాజిఁ బఱపన్ వెఱ పగ్గలమై[4] తెరల్పఁగాఁ
బోయి విరోధు లుగ్రవనభూములు సొచ్చి ఫలచ్ఛదోదక
స్వీయ[5]విధేయులై యనుభవింపుదు రుగ్రతపస్విధర్మముల్.

332


వ.

అతని యనుజుండు.

333


సీ.

అరిమనోమండలం బర్కమండలమును
        భయమంది పటపటపటనఁ బగుల
రణభోగసంవ్యాప్తి రంభావధూప్రాప్తి[6]
        తమకించి తటతటతటను నదర

  1. B. గంధాంబ
  2. A.B. ప్రభు
  3. B. తిమ్మబరువిభుచన్ననరేశు వెంకటాద్రినాథవతంసున్
  4. B. వెలపగ్గలమై
  5. B. స్థేయ
  6. A. రంభారసవ్యాప్తి B. రంభాపసవ్యాప్తి