పుట:వెలుగోటివారి వంశావళి.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

113


భటపంతరవము నుద్భటకుంతరవమును
        బెనఁగొని పెటపెటపెటను నెగడ[1]
శరనికాయంబును శాత్రవనయనాశ్రు
        తోయంబు తొటతొటతొటను దొఱుఁగఁ[2]
జిత్రమైయుండు నీదండయాత్రమహిమ
ధాత్రి ముక్తాతపత్రితోద్దండకీర్తి
విభవవిస్తార పెదకొండవిభుకుమార
సింధురాటోప వెలుగోటిచిన్నభూప.

334


వ.

త దనుజుండు.

335


చ.

కలగలరాజు నిండుదయ గల్గినరాజు మొగంబునందు న
వ్వలరెడురాజు నీతివినయంబుల మించినరాజు శాంతిచే
బలసినరాజు పాడియును బంత మెఱింగినరాజు కీర్తులన్
వెలసినరాజు కొండవిభువేంకటనాథుఁడు రాజమాత్రుఁడే.

336


ఉ.

శ్రీలలితుండు వైరిగజసింహుఁడు దాతలచక్రవర్తి ది
క్కీలితకీ ర్తి నీతిపదఖేలనలోలుఁడు ధర్మకర్మసం
శీలుఁడు సుప్రసన్నగుణసింధువు మాపెదకొండధారుణీ
పాలుని వేంకటాద్రి ధృతిపాకహిమాద్రి నృపాలమాత్రుఁడే.

337


వ.

సంతతికిఁ జెన్నప్పనాయుఁడు మొదలు.

338


సీ.

గండికోటాదిదుర్గము లనర్గళశ క్తి
        జలపట్టి సాధింపఁగలఁడె యొకఁడు
కుతుపనమల్కపం పతిభయంకరవృత్తి
        గదిసిన డీకొనఁగలఁడె యొకఁడు
కయ్యంబులో మన్నెకంఠీరవులకెల్లఁ
        గన్నాకుగా నిల్వఁగలఁడె యొకఁడు
తననిజస్వామికి ఘనజయాంగనలను
        గైకానుకలు సేయఁగలఁడె యొకఁడు

  1. A.B. బనుగొని పెటతటతటనునదుర
  2. A.B. తమకించితటతటనునదుర