పుట:వెలుగోటివారి వంశావళి.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

109


దవులతాబాదు[1] గందపుకాకితంబునఁ[2]
        బలుమారునద్దినఁ[3] బాసిపడదు
మధురసాస్వాదమదఘూర్ణమానయవన
పరివృఢా[4]పేక్షణాళ్లిష్టపవనజవన
తిరుపతినృపాలుతిమ్మభూవర త్వదీయ
ధాటికాఘోటకఖురోత్థ[5]ధరణిధూళి.

320


ఉ.

నీచిరదానవారితటినీపతి నాని పయోధి మించుఁ ద
త్సేచన[6]వర్ధమానతృణసేవ సమస్తము నిచ్చు దేవతా
నైచికి తత్కరీషభజన న్మఱి[7]కల్పక మిచ్చు సర్వదా
త్రాచరణంబు నీవలన నైనది[8] తిమ్మనృపాలశేఖరా.

321


ఉ.

దేవమహీజ మందె నొకదిక్కున మంజరి[9] చంద్రుఁ డందెఁ దా
రావళి వార్షికాంబు[10]ధర మందె నుదాహరణంబు నీతసం
భావన మింటివార్త లవి మన్నన నీవలె నెవ్వరంది రెం
తే వసుధాస్థలిన్ దిరుపతిప్రభుతిమ్మ మహాప్రబంధముల్.

322


సీ.

శ్రీరామపాదరాజీవయుగ్మమరంద
        రసమి[11]ళన్మత్తసారంగ రంగ
పరవరూధిన్యుత్థపటహదంధణవిస్ఫు
        రద్రావనృత్యత్తురంగ రంగ

  1. B. దవులతోబాదు
  2. B. కాశితంబున
  3. B. నధిన
  4. A.B. పరిదృఢా
  5. A. ఘురాద్ధధరణిధూళి
  6. A. త | చ్చెచన ; B. చ్చెచన
  7. A.B. భజన్మణి
  8. A.B. ధా | త్రీచరణంబు...నైనది
  9. A. మంజలి
  10. A.B. కంబు
  11. A.B. సమ్మిళ